గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅందరి వారం ఆదివారం

29 జూన్, 2026

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆరు రోజుల అనంతరం

మా పిల్లల బడులకు విరామం

పుస్తకాలనూ పక్కన పెడతాం

బామ్మ చెప్పే కథలే వింటాం

ఆటపాటలకు బయటకు వెళ్తాం

మిత్రులతో కలిసి ఆడుతాం

అలిసిసొలిసి ఇంటికి వస్తాం

అమ్మ పెట్టిన బువ్వే తింటాం

నాన్నకు కబుర్లు బాగా చెబుతాం

ఆయనకూ ఆరోజు సెలవుదినం

అందుకే ఆదివారం మాకిష్టం

ఆదివారం.. అది అందరి వారం

అమ్మకు మాత్రం అదనపు భారం

ప్రతి పనిలోనూ చేద్దాం సాయం!

– చెన్నాప్రగడ శర్మ,

94405 87567.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్