గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఆకర్షించే ఆకుపచ్చ!

21 జులై, 2026

Untitled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆకుపచ్చ రంగు

ఆకర్షించే రంగు!

ఆకుపచ్చ రంగు

ఆశను నింపే రంగు!


అరటి, మామిడి, పచ్చిమిర్చి

దొండ, బెండ, చిక్కుళ్లు

సొర, బీర, కాకరలు

ఆకుపచ్చని కూరలండి

ఆరోగ్యానికి అవసరమండి


నిమ్మ, జామ, నారింజ

ద్రాక్ష, దబ్బ, బత్తాయి

సీతాఫలము, బొప్పాయి

అన్నీ మనకు నచ్చేవే

అన్నీ మనము మెచ్చేవే


సొగసైన సంపెంగలు

ఆహ్లాదాల డాలియాలు

అందాల ఆర్కిడ్‌లు

ఆకుపచ్చని పూలండి

అవనికి ఎంతో శోభండి


మిడతలు, చిలకలు

కప్పలు, తాబేళ్లు

కొండచిలువలు, పాములు

ఆకుపచ్చని జీవులండి

సృష్టిలో ఉన్నవి చూడండి


ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఆకుపచ్చ

కదలమని చెప్పే సంకేతం

జాతీయ జెండాలో ఆకుపచ్చ

వృద్ధి, శ్రేయస్సుకు సంకేతం!

– జె. శ్యామల,

99896 01113


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్