శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచాచా నెహ్రూ.. బాలల ఆప్తబంధువు!

15 నవంబర్, 2026

b0f6bea349d6ef42d833e66568a7792e.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 07:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలల పట్ల ప్రేమ, ఆప్యాయత

గులాబీని గుండెలపై ధరించిన చిరునవ్వుల మూర్తి

చిన్నారుల చెంత చేరిన ప్రేమమయుడైన కీర్తి!

పసిపాపల నవ్వుల్లో పరవశాన్ని చూసేవాడు

వారి బుజ్జి బుజ్జి మాటల్లో ఆనందాన్ని వెతికేవాడు!

పదవులకన్నా బాలల ప్రేమే మిన్నగా భావించాడు

వారి మధ్య గడిపే క్షణాలనే మధురంగా తలచాడు!

చాచా అంటూ పిల్లలు పిలిస్తే చల్లగా స్పందించేవాడు

చిన్నారి హృదయాలకు ఆప్తబంధువుగా నిలిచేవాడు!

బాల్యంలోని అమాయకత్వం అందమైన ఓ వరం

ఆ చిరునవ్వులు కాపాడటం సమాజానికి ధర్మం!

నెహ్రూ చూపిన ప్రేమను మనసుల్లో నింపుకుందాం

ఆప్యాయత పంచుతూ ముందుకు సాగుదాం!


ఉమా కార్తికేయ.jpg

నడకుదురు ఉమా కార్తికేయ,

7వ తరగతి, శ్రీ విజయా అకాడమీ,

చల్లపల్లి, కృష్ణాజిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్