ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చదువంటే ఇష్టం

1 గంట క్రితం

స్టడీ.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 07:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చదువంటే నాకు చాలా ఇష్టం,

ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాం

పుస్తకమంటే నాకు ఎంతో ఇష్టం.

అక్షరాల వెంట అడుగులు వేస్తూ,

జ్ఞాన లోకంలో విహరిస్తాను.

పుస్తకం తెరిచిన ప్రతిసారీ

కొత్త విషయాలు తెలుస్తాయి,

చదివిన ప్రతి అక్షరం

నా భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

చదువు ఉంటే జ్ఞానం వస్తుంది,

జ్ఞానం ఉంటే ధైర్యం వస్తుంది.

మన కలలను నిజం చేసుకోవడానికి

చదువే మనకు గొప్ప ఆయుధం.

అందుకే ప్రతిరోజూ చదువుతాను,

తెలుసుకున్న విషయాలను పంచుకుంటాను.

చదువుతో ఎదిగి,

సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా నిలవాలనేది నా కోరిక

Lakshmi Pragathi.jpg

లక్ష్మీ ప్రగతి, 9వ తరగతి

వేమన ఇంటర్నేషనల్‌ స్కూలు,

చిన్న దోర్నాల, మార్కాపురం జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్