ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిటికెన వేలా!

1 గంట క్రితం

alaparhty vari geyam-23-8-26.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చిటికెన వేలా

చింతనీకేల?

చిన్నగుంటివని

చిన్నబోనేల??

చిన్నపుడు నిన్నె

చేతికందించి

పడకుండ నన్ను

నడిపించె నాన్న!!

ఎవరికైననూ

ఎవరైన గాని

దండమిడ నీవె

ఉండేవు ముందు!!

మూత్రం వస్తే

ఆత్రంగ నిన్నె

ఎత్తిచూపేరు

ఎవరైన బడిలొ!!

వధూవరులింక

వదిలిపెట్టరుగ

పట్టుకొని నిన్ను

పరవశత్వమున!!

గోపాలకృష్ణ

గోవర్ధనగిరి!

నీ మీదనేగ

నిలిపింది వేగ!!

‘బాలబంధు` అపర్తివారి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్