ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకలి..

1 గంట క్రితం

akali.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రోళ్ళు బద్దలు కొట్టే ఎండ

రెక్కలు ముక్కలు చేసుకొంటున్న

నల్లరాతి శిల్పాలపై కరిగి నీరౌతుంది

నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే కొలిమి

ఆకలి చల్లార్చే అగ్నిదేవుడు వాళ్ళకు!

​కడుపులో రగిలే ఆకలి ముందు

కళ్లముందు వెలిగే కొలిమి వెలవెలబోతుంది

చిరుగుల చీర పేదరికం జెండాలా

కాలే కడుపుల్ని కళ్ల ముందే ఎగరేస్తుంది!

​ధనవంతుల మనసులా కఠినమైన

ఇనుము కరిగించే కొలిమి

ఆకలి తీరాలకు చేర్చే కలిమని నమ్మి

తిత్తి రగిలిస్తుందా పిచ్చితల్లి!

​ఊపిరి బిగించి స్వేదాగ్నిలో

మెత్తబడ్డ ఇనుముకు

సుత్తితో ప్రాణం పోస్తున్నాడు

ఆకలి పంచుకున్నోడు!

​చింపిరి జుత్తు ఆకలి వారసుడు

కళ్ళు తెరిచింది ఆలస్యం

కనిపించని ఆకలి తీర్చమని

ఏడుపు లంకించుకున్నాడు!

​ఖాళీ కడుపులాంటి గుడిసెలో

ఎటు చూసినా బోసిపోయి శూన్యం తప్ప

ఆకలి తీర్చే ఆధరువొక్కటీ లేదు!

​రోడ్డు పక్క అమ్మకానికి పేర్చిన

కత్తులు.. సుత్తులు..

వారి శ్రమ సంగమంలో

పునీతమై పుట్టిన కళాకృతులు

అవి మెతుకులుగా ఉడికితేనే

కడుపులో కొలిమి చల్లారేది..!

భీమవరపు పురుషోత్తమ్

9949800253​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్