ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపనస కాయ

1 గంట క్రితం

PANASAKAYA KATHA-BALALA KATHA2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ముత్యాలపురం అనే ఊరిలో తాజు అనే చిన్న వ్యాపారి, తన భార్య పుష్పాతో సంతోషంగా జీవించేవాడు. తాజు ఇంటి పెరట్లో జామచెట్టు ఉంది. కాయలు బాగా కాసేవి. వాటిని అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవనం సాగించేవారు.

ఒకరోజు తాజు కాయలు అమ్మడానికి సంతకు వెళ్లాడు. అక్కడ సంతలో జామకాయలు అమ్ముతుండగా అక్కడికి సోమరాజు అనే వ్యక్తి ముళ్ళతో పచ్చగా, పెద్దగా ఉన్న ఒక పండును తీసుకువచ్చి పక్కన కూర్చున్నాడు. అతన్నే చూస్తున్నాడు తాజు. ‘అయ్యో.. ఈ వ్యక్తి ఎంత అమాయకుడు. లేకపోతే ఇన్ని ముళ్ళు ఉన్న ఈ పండును అమ్మడానికి వచ్చాడా? మూర్ఖులు తప్ప దీనిని ఎవరు కొంటారు?’ అని మనసులోనే నవ్వుకున్నాడు. తాజు అలా చూస్తూ ఉండగా సోము తెచ్చుకున్న వస్తువుల నుంచి ఒక పెద్ద కత్తి, ఒక నూనె డబ్బా తీశాడు. దీనితో ఏం చేస్తాడబ్బా.. అని అలానే చూస్తున్నాడు తాజు. సోము ఆ నూనె డబ్బాను తెరిచి, తన మోచేతి దాకా పూసుకొని, ఆ పెద్ద కత్తికి నూనె పూసాడు. ఆ పండును కోయగానే మంచి కమ్మటి, తీయటి వాసన తాజుని మైమరిపించింది. సోము ఆ పండును కోసి ఒక్కొక్క తొనను బయటికి తీశాడు.

తాజు వాటి రుచి చూడాలనుకునే లోపు ఆ వాసనకి అందరూ వాటిని కొనేశారు. ఖాళీ అయిన బుట్టను చూసి, తాజు వెంటనే సోము దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. ‘అరె!.. ఆ ముళ్ళున్న పండు ఏమిటి? చాలా మంచి రుచికరమైన వాసన వస్తుంది’ అన్నాడు.

అది విని, సోము నవ్వాడు. ‘భలేవాడివే ఈ పండు పేరు తెలీదా నీకు!.. దీనిని పనసపండు అంటారు.. మహారుచిగా ఉంటుంది’ అని బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు.

ఆ రోజంతా తాజు బుర్రలో పనసపండు గురించే ఆలోచనంతా. ఇంటికి వెళ్ళిన తాజుకి నిద్ర పట్టలేదు. అది గమనించిన అతని భార్య ఏమైందని అడిగింది!. ​తాజు మాటలు విన్న పుష్పాకీ నోరూరింది. ఎలాగైనా ఆ పనసపండు తినాలనుంది. అదే మాట భర్తతో చెప్పింది. ఎలాగైనా తీసుకొని రమ్మని ఆర్డర్ వేసి, పంపించింది. ​ఆ చీకటిలో పక్క ఊరికి చేరుకొని, ఊరంతా వెతికినా తాజుకి పనస చెట్టు ఎక్కడా కనిపించలేదు. అలా వెతుకుతుండగా సోము ఇంట్లో పెద్ద పనస చెట్టు, కాయలతో కనిపించింది. తాజు సంతోషంతో.. ఒక పెద్ద పనసకాయ కోసి, ఎవరూ చూడకుండా తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.

భర్త చేతిలో పనసకాయ చూసి, పుష్పా ఉండబట్టలేక తొందర తొందరగా కోసేసింది. జిగురుతో రెండు చేతులు అతుక్కుపోయాయి. చేతులని లాగడానికి ప్రయత్నిస్తున్న భార్యని చూసి అప్పుడు అర్థమైంది తాజుకి, ఆ రోజు సోము ముందుగా చేతులకు నూనెను ఎందుకు పూసుకున్నాడో. వంటింట్లో నుంచి నూనె డబ్బాను తీసుకువచ్చి, తన చేతులకి పూసుకుని, పుష్ప చేతులకి పోశాడు. అతుక్కున్న చేతులు విడిపోయాయి. తర్వాత ఇద్దరూ ఆ రుచికరమైన తీయటి పనసపండును ఆస్వాదిస్తూ ఆరగించారు. ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ రుచి ఎంతో నచ్చింది. తామూ పనసకాయల వ్యాపారం చేయాలని అనుకున్నారు.​

అనిసా తబస్సుమ్ ఎస్‌‌కె

74160 79257

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్