మూగజీవాలు కూడా మనలాంటి ప్రాణులే
వాటికీ ఆకలి, దాహం,బాధ ఉంటాయి
వాటిని ప్రేమగా చూసుకుందాం
హింసించకుండా ఉందాం
వీధి జంతువులకు నీళ్లు, ఆహారం అందిద్దాం
పెంపుడు జంతువులను జాగ్రత్తగా పెంచుకుందాం
వాటి అనారోగ్యానికి సరైన వైద్యం చేయిద్దాం
అడవులను కాపాడి, వాటి నివాసాలను నిలబెడదాం
మూగజీవాల బాధను అర్థం చేసుకుని తోడుగా ఉందాం
జంతువుల పట్ల దయ చూపడమే మానవత్వం
సకల జీవులను ప్రేమించడమే మంచి మనసుకు గుర్తు

బండి హర్ష, 7వ తరగతి
స్రవంతి హైస్కూలు,
గన్నవరం,కృష్ణాజిల్లా.








కామెంట్‌లు (0)