గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకథల కుందేలు

14 జులై, 2026

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అదొక పెద్ద అడవి

ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు

చెట్టుకింద కొన్ని జంతువులు

చెట్టు పైన ఎన్నో పక్షులు


పెద్ద పక్షులు, పెద్ద జంతువులు

ఆహారానికి వెళితే

మిగిలిన వాటితో పాటు చీమలకు

నీతి కథలు చెప్పేది ఒక కుందేలు


చాటునుండి వచ్చిన వేటగాడు

ఒక్కసారిగా కుందేలును

పట్టుకొని వెళ్లసాగాడు

అన్నీ ఉలిక్కిపడ్డాయి


మరుక్షణమే ఒక్కటయ్యాయి

ఆలోచించి ఒక్కటిగా

నిర్ణయాలు తీసుకొనగానే

వెంటనే అమలు పరిచాయి


కొద్దిదూరం ఎగరగల చిట్టి కాకులు

ఎండుపుల్లలు తెచ్చి నేల మీద ఉంచాయి

ఎర్ర చీమలు ఎక్కగానే

తీసుకెళ్లి వేటగాడి ముందు వేశాయి


చిట్టి ఉడుత చిట్టి కుందేలు కలిసి

దురద ఆకులను తెచ్చాయి

వేటగాడి కాళ్లకు రుద్దాయి

ఎర్ర చీమలు కాళ్లపైకి ఎక్కాయి


దురదాకు మంట పాదాలలో

కాళ్లంతా చీమలు కొరుకుడు బాధ

అప్పుడే ఎండిన పుల్లతో వేటగాడి

కన్నును పొడిచింది ఒక పక్షి


బాధను భరించలేక కుందేలును

వదలి పరుగెత్తిపోయాడు

అందరూ చెట్టుకిందికి

రాగానే కుందేలు ఇలా చెప్పింది


నేను చెప్పిన కథల వలన మీలో

ఐక్యత, తగు నిర్ణయాలు తీసుకొన్నారు

నేను చెప్పిన కథలే మీ ద్వారా నన్ను

కాపాడాయి అంది కథల కుందేలు


పిల్లలూ, నీతి కథల పుస్తకాలు చదవండి

పెద్ద వారితో కథలు చెప్పమనండి

ఆ కథలు మీ తెలివితేటలు పెంచుతుంది

బంగారు భవిష్యత్తుకు పునాదులు నీతి కథలు

- ఓట్ర ప్రకాష్ రావు

కొలంబస్ / USA

09787446026

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్