మా బడి అక్షరాల తోట
నిత్యం సేద్యం చేసే
నిస్వార్థ ఉపాధ్యాయులే
మా తోటమాలి!
మేమంతా ఎదుగుతూ
పెరుగుతున్న మొక్కలం
రేపటికి వికసించి
పరిమళాలు వెదజల్లే పువ్వులం!
కంటినిండా
కలలు కంటూ ప్రతినిత్యం
బతుకు పంట
భుజానేసుకొని బయటకు వస్తాం!
సామాజిక అవసరాలకు
ఆసరాగా నిలుస్తాం
భావితరాల బ్రతుకులు
మరింత సులభతరం చేస్తాం!
- తిప్పాన హరి రెడ్డి
94938 32412.








కామెంట్‌లు (0)