చిట్టి చిట్టి చేతులతో
విత్తనాలు నాటుదాం!
పచ్చనైన చెట్లతోటి
లోకమంతా నింపుదాం!
మంచి రకపు కొమ్మలను
అంటుకట్టి పెంచుదాం!
మధురమైన పండ్లను
అందరికీ పంచుదాం!
క్రింది కొమ్మ నేలవంచి
అంటు తొక్కి పూడ్చుదాం.
కొత్త వేర్లు వచ్చినాక
తల్లి వేరు తెంచుదాం.
పాపలారా! రారండీ,
బాబులారా! ఇటు రండి.
ప్రాణవాయువు ఇచ్చేటి
మొక్కలను నాటండి.
సహజ ఎరువు వాడండి,
రసాయనాలు వద్దండి.
వేరుకు తగు నీటిని
విరివిగా పోయండి.
పండ్లు, కూరగాయలు,
పువ్వులను కోయండి.
ఆరోగ్యం మన సొంతం
అందరికీ చాటండి.
- పేట యుగంధర్, వెదురుకుప్పం
94925 71731








కామెంట్‌లు (0)