సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి పాట

4 గంటల క్రితం

environment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొండల కోనల అందాలు

పచ్చని వనాల పలకరింపులు

వాగుల వంకల హొయలు లయలు

ఉరికే జలపాతాల గానాలు

పక్షుల కిలకిల రావాలు

కోయిల కుహు కుహు గీతాలు

రామచిలుక రాగాలు

నెమలమ్మ నాట్యాలు

పచ్చని చెట్ల చల్లని గాలి

పరిమళించే పూల తావి

రంగు రంగుల సీతాకోక చిలుకలు

జానపదుల పాటల సడి

ఉదయించే సూర్యుని కాంతులు

జాబిలమ్మ వెన్నెల ఝరులు

ఆకాశాన తారల మెరుపులు

సెలయేటి సరిగమలు

ఇవన్నీ ప్రకృతి బహుమానాలు

పరవశించే మన కనుల పండుగలు

పర్యావరణాన్ని కాపాడుదాము

భావితరాలకు అందిద్దాము

ప్రకృతిని ప్రేమిద్దాము

అందరికీ ఆనందం పంచుదాము

ప్రకృతిని పరిరక్షిద్దాం

ప్రతినతో ముందుకు సాగుదాం

​- మొర్రి గోపి, కవిటి,

శ్రీకాకుళం జిల్లా, 88978 82202.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్