గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​మా ఊరి బడి

28 జూన్, 2026

alaparthygemafinal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 06:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా ఊరి బడి నేను

మరువలేకున్నాను!

ఆ బడితొ నాకున్న

అనుబంధమూ మిన్న!!

ఆవరణ లోపలా

అడుగు పెడితే అలా

మనసుకూ గిలిగింత

తనువంత పులకింత!

బడికి గేటొకటుంది

బార్ల తీసుంటుంది!

పేద, గొప్ప తేడా

లేదు ఎవ్వరి ఎడా!!

చిరిగె నీ చొక్కాయి

ఛీ ఛి పోమ్మనదోయి!

అందరిని తానుగా

ఆదరించేనుగా!!

ఆటస్థలము గూడ

ఆనందమే చూడ!

ఆడ ఆటలు ఆడ

అసలు నే వెనుకాడ!!

ఎదురుగా కనిపించు

కుదురైన దనిపించు

ఎత్తయిన వేదికా

ఎక్కడా లేదికా!!

ఆదిలోనా నేను

వేదికను ఎక్కాను!

చిరు చెమట పోసింది

మిరుమిట్లు గొలిపింది!

అటు పిమ్మటా నేను

అలవాటు పడినాను

భయము నను వీడింది

జయము సమకూడింది

(సందరగిరి రమ్య గారికి కృతజ్ఞతలు)


​‘బాలబంధు` అలపర్తి వెంకటసుబ్బారావు.

(కేంద్ర సాహిత్య అకాడమీ

బాల సాహిత్య పురస్కార గ్రహీత)

9440805001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్