సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాపా!

05 జులై, 2026

papaa!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంతకన్న ఏమి వద్దులే-పాపా!

నీ చిరునవ్వే ముద్దులే!!

బుగ్గన చిటికేస్తు వుంటె

బోసినవ్వు నవ్వినావు!

ఎత్తుకు ముద్దాడుతుంటె

మత్తు ఎదను రువ్వినావు!!

ఉంగ ఉంగ అంటువుంటె

ఉల్లాసం పొందినాను!

ఊయలలో ఊగుతుంటె

ఊరటనే చెందినాను!!

చిలుక పలుకులను వింటూ

చిత్తరువై నిలచినాను!

తప్పటడుగులను కంటూ

తప్పదు అని తలచినాను!!

తెలివి తేటలను చూస్తూ

పులకరించి పోయినాను!

మెండుగ సందడి చేస్తూ

వుండాలీ హాయిగాను!!


​‘బాలబంధు` అలపర్తి వెంకటసుబ్బారావు.

(కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత)

9440805001.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్