ఊరు చివర మర్రి చెట్టు
ఊడలతో చక్కగుండె
అందు ఉన్న గూళ్ళలోను
పక్షులెన్నొ నివసించే!
నల్లకాకి, తెల్లకొంగ
ఆకుపచ్చ చిలుకమ్మ
గూళ్ళలోను ఉంటూనే
ఐక్యంగా ఉండసాగె!
ఇప్పుడేమో గుడ్లగూబ
ఆ చెట్టును ఆశ్రయించె
అది చూచిన ఈ పక్షులు
భయంతోనె అరవసాగె!
'పగటిపూట నా కనులకు
దృష్టన్నది కానరాదు
మీ పంచన నే ఉంటే
నా బతుకుకు రక్షణుండు
భయం వలదు మిత్రులార
మీ దయఊరు చివర మర్రి చెట్టు
ఊడలతో చక్కగుండె
తో నేబతికెద
కాదనకనె జాలిచూపుడు'
చెప్పిచూసె గుడ్లగూబ!
'నీ మాటలు సత్యదూరం
నీ ఉనికే కలుగు భయం
నిన్ను నమ్ము టెట్ల'నుచు
గడుసుగడిగె పక్షులన్ని!
'వృద్ధాప్యం సమీపించి
శక్తంతా సన్నగిల్లె
మాంసాన్ని విడిచిపెట్టి
పండు, కాయ తినుచుంటి
ఇంతకన్న రుజువేమిటి?
కష్టదశన ఉన్న నన్ను
మీ తోడుగ ఉంచగలరు'
వేడుకొనెను గుడ్లగూబ!
'నీ మాటలు నమ్మలేము
పండు తినుట రుజువు చూపి
చిత్తశుద్ధి చాటుకొనుము'
అడిగినంత చిట్టిచిలుక!
క్షణమాగక చిలకమ్మ
తొర్రలోకి దూరినది
ఎర్రనైన పండునొకటి
ముక్కుకరచి తెచ్చినదది!
'ఆరగించు ఈ పండు
తిని చూడ భలేగుండు'
గుడ్లగూబ కందిస్తూ
చిట్టిచిలుక చెప్పెనంత!
వేసెనెత్తు ఫలించిదని
గుడ్లగూబ సంతసించె
రుజువు కోసం పండుకొరికె
గుడ్లగూబ గూబ అదిరె!
'ఏమి పండు ఇది?' అంటూ
గోల చేసె గుడ్లగూబ
'మిరప పండు అది!' అంటూ
బదులుపలికె చిలకమ్మ!
'చిలకమ్మ తెలివి ముందు
నా ఆటలు సాగవింక'
తలచి వగచి గుడ్లగూబ
నీరు త్రాగ ఎగిరిపోయె!
- బి.వి.పట్నాయక్,
83098 72913.







కామెంట్‌లు (0)