సైకిల్ ఎక్కి సాగితే
సరదాయే వేరు
ఆరోగ్యమే దాని తీరు
వ్యాయామం మహా జోరు
తొక్కుటయే ఇంధనం
శ్రమయే ధనం
సాగుతుంటే ఆనందం
ఆహ్లాదం అపురూపం
పర్యావరణహితం
పడిలేస్తూ నేర్చుకుంటాం
బాల్యపు జ్ఞాపకం
సైకిల్... ఓ మిరాకిల్
పిల్లల కలల స్వప్నం
స్నేహితులను పెంచే వాహనం
సైకిల్ తొక్కుట ఆనందం
అందరికీ అందుబాటులో ఈ రథం
సైకిల్ సవారీ
బాల్యానికి బంధువు
మిత్రులతో విహరిస్తూ
చేస్తుంది విన్యాసాల లహరి
- మొర్రి గోపి,
కవిటి, శ్రీకాకుళం జిల్లా,
88978 82202.






కామెంట్‌లు (0)