సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆసుపత్రి నుంచి వాంగ్‌‌చుక్‌ డిశ్చార్జ్‌

1 గంట క్రితం

wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 12:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాజ్‌‌ఘాట్‌ వద్ద గాంధీకి నివాళి

న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మేదాంత ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్‌ అయిన వెంటనే తన భార్య గీతాంజలి అంగ్మోతో కలిసి రాజ్‌‌ఘాట్‌‌కు చేరకుని మహాత్మా గాంధీకి నివాళర్పించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో గత ఆరు రోజుల నుంచి వాంగ్‌‌చుక్‌ ‌చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వాంగ్‌చుక్‌కు "ఇంటర్నల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో కూడిన చికిత్సా విధానం" ద్వారా చికిత్స అందించినట్లు మేదాంత ఆసుపత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. డిశ్చార్జ్ అయ్యే సమయానికి వాంగ్‌‌చుక్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి జంతర్‌ ‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఈ నెల 18న ఆయనను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. తరువాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మేదాంత ఆసుపత్రికి తరలించారు. తన డిశార్జ్‌ ‌విషయాన్ని వాంగ్‌‌చుక్‌ ‌కూడా సోషల్‌ ‌మీడియా ద్వారా వెల్లడించారు. రాజ్‌‌ఘాట్‌ ‌నుంచి బయలుదేరి లడఖ్‌కు వెళ్తానని తెలిపారు. అలాగే, మేదాంత ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్