దీపావళి.. దీపావళి..
మా ఇంటా మీ ఇంటా దీపావళి
అమావాస్య చీకట్లను
పారద్రోలు దీపావళి
చిమ్మ చీకటిని చీల్చి
వెలుగు తెచ్చు దీపావళి
పిల్లలకు ఆనందం
దీపావళి
పెద్దలను గుర్తు చేయు
దీపావళి
నరకుని చెర వదిలిందని
ప్రజలు సంతసించారని
పురాణాల గాథను విని
ఆ కథను తెలుసుకుని
అందరమూ చేద్దాము
దీపావళి
పిల్లల పెద్దల పండుగ
దీపావళి
మావయ్య తెచ్చినట్టి
మతాబులు, చిచ్చుబుడ్లు,
అమ్మ ఇంట వండింది
తియ్యనైన తీపి లడ్లు
అన్నయ్య చేశాడు
చిటపటల సిసింద్రీలు
తాతయ్య తెచ్చాడు
మట్టితో చేసిన ప్రమిదలు
కొత్త బట్టలను కట్టి
దివిటీలను కొట్టి
తీపి మిఠాయిలను పట్టి
చేసేస్తాం తియ్యనైన దీపావళి
జాగ్రత్తలు పాటిస్తాం
ముందు వెనుకలను చూస్తాం
అపాయాలు జరగకుండా
ప్రమాణాలు పాటిస్తాం
- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.








కామెంట్‌లు (0)