శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అందమైన బాలలం

13 నవంబర్, 2026

అందమైన బాలలం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అందమైన బాలలం - అల్లరి చేసే పిడుగులం

అమ్మానాన్నల పంటలం - నవ్వులు నిండిన పువ్వులం

మేమే పిల్లలం – బడిలోని మొలకలం

​తరగతి గదిలో మొక్కలం – భవితకు తరువులం

విజ్ఞానానికి నిధులం – ప్రేమలకు ప్రమిదలం

​అక్షరాల హారతులం – జ్ఞాన దీపపు వెలుగులం

​సంస్కార సారధులం – వినయానికి విలువల గనులం

​గెలుపునకు వారసులం – మైదానంలో విజేతలం

​పలుకుల్లో చిలకలం – రాగాల్లో కోకిలం

​రెక్కల్లో పక్షులం – భవిష్యత్తు ఆశలం

కలల ప్రతినిధులం – ప్రగతికి గుర్తులం

​జగతికి చక్రాలం – రేపటి కాంతులం

​చెట్టు పుట్టుక తోడులం – ఆటపాటలే అందలం

​విరబూసిన పువ్వులం – ఆనందపు నవ్వులం

ఆడుకునే బొమ్మలం – గోరుముద్దల ముద్దులం

​ఇంద్రధనస్సు వర్ణలం – ఇలలో వెలసిన రంగులం


- కొప్పుల ప్రసాద్,

98850 66235.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్