శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బడిబాటలో త్రిపదలు

13 నవంబర్, 2026

బడిబాటలో త్రిపదలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 02:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అడ్డంకుల గడ్డి పీకేయాలి

మా ప్రభుత్వ బడిబాటను

తేటపరచాలి

​

బడిబాటలో మొలిచిన గడ్డి

మా పిల్లల‌ పాదాలకే

తలొంచుతుంది

​

బడిబాటలో

గడ్డికి బాగా కొమ్ములొచ్చాయి

మా పిల్లలే వొంచగలరు

​

బడిబాట

రేపటి‌ మా‌ భవిష్యత్తుకు

రహదారి

​

బడికెళ్లే

మా పిల్లదారులన్నీ

దేశానికి రేపటి రహదారులు

​

బడిబాటలో

సీతాకోకల్లో సీతాకోకలం

పుస్తకాల బ్యాగులతో

- చిత్తలూరి,

91338 32246.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్