వేకువనే నిద్ర లేచేందుకు
బద్దకించే కాలం
శరీరం నులివెచ్చని
వేడిని కోరే కాలం
మంచుపొరలు సూర్యుడిని
కప్పివుంచే కాలం
ఉష్టోగ్రతలు తగ్గి
మంచు జల్లులు కురిసే కాలం
పెద్దల నుంచి పిన్నలవరకు అందరూ
కృత్రిమ వేడిని పొందాలనుకునే కాలం
ఒంట్లోని రక్తాన్ని
చలిమంటలతో కాచుకునే కాలం
ఉన్ని దుస్తులను ధరించు కాలం
వాహన చోదకులకు కష్టకాలం
గమ్య స్థానాలకు ఆలస్యంగా చేరు కాలం
కష్టమైనా ఇష్టంగా భరించాల్సిన కాలం
మూడు నెలల పాటు ముచ్చటగా ఉండు కాలం
ఇదే ఇదే చలికాలం
అదే అదే శీతాకాలం
- ఆళ్ళ నాగేశ్వరరావు, తెనాలి.








కామెంట్‌లు (0)