mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబోరుటో .. ది లెజెండ్

4 రోజుల క్రితం

Boruto
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్..!
నాకు నరుటో, నరుటో షిప్పుడెన్, బోరుటో అనే క్యారెక్టర్స్ కి సంబంధించిన సిరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను బోరుటో వాల్యూమ్ 10 పుస్తకం కొనుక్కున్నాను. ఆ పుస్తక రచయిత పేరేంటో తెలుసా.. ఆయన జపాన్ కి చెందిన ఫేమస్ రైటర్ మషాషి కిషిమోటో. ఈ బుక్ ని నేను చదివాను. ఐతే ఇందులో నాకు ఇష్టమైన ఒక క్యారెక్టర్ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఈ పుస్తకంలో ఇష్టమైన పాత్ర ససుకే ఉచిహ. నేను తన గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను.
‘‘ససుకే ఉచిహ చాలా మంచివాడు. 16 ఏళ్ల వయసులో అతను ఒరోచిమారును చంపాడు. ఎందుకంటే తాను శవాల మీద రాక్షస పరిశోధనలు చేసేవాడు. తర్వాత అతను స్నేక్ సెజ్ మోడ్ అనే ఒక కళను నేర్చుకున్నాడు. అతను తన అన్నయ్య ఇటాచీలాగే 16 ఏళ్ల వయసులో మాంగెక్యో షారింగన్‌ అనే ఒక యూనివర్సల్ ఐని మేల్కొల్పాడు. అతను తన అన్నయ్య ఇటాచీని కూడా చంపేస్తాడు. ఇక నా హీరో ససుకే ఉచిహ మూడేళ్ళలో కత్తిసాము (కెన్జుట్సు) లో ప్రావీణ్యం సాధించాడు. అతను ఒబిటో, కరిన్ స్నేహితుల్లాంటి వాళ్ళ సహాయంతో డాంజో అనే విలన్ ని చంపేస్తాడు. అతను తన మాంగేక్యో, అతని అన్నయ్య మాంగేక్యో షారింగన్‌ని కలపడం ద్వారా శాశ్వతమైన మాంగేక్యో షారింగన్‌ని మేల్కొల్పాడు. ప్రపంచాన్ని అనంతమైన భ్రమలో ఉంచాలని ఆలోచిస్తున్న హోగోరోమో తల్లి కగుయా ఒట్సుట్సుకిని చంపడానికి, హోగోరోమో ఒట్సుట్సుకి ప్రసాదించిన ఆరు మార్గాల సెంజుట్సుతో బలం పెంచుకుని, అతను మరింత శక్తివంతమయ్యాడు. ఈ శక్తి అతడిని రినేగాన్ ను మేల్కొల్పడానికి దారితీసింది. అతను తన రినేగాన్ ను మేల్కొల్పాడు.. కానీ అది ఒక ప్రత్యేకమైన యూనివర్సల్ ఐ. ఎందుకంటే దానికి ఆరు టోమోలు ఉన్నాయి. ఇది అతను షేరింగాన్, రిన్నెగాన్ శక్తులు రెండింటినీ వాడుకోగలడు. అతనికి ఇంకా ఉన్న సామర్ధ్యాలు ఏంటంటే తన శత్రువులతో స్థానాలు మార్చుకోవడానికి సహాయపడే అమెనోటెజికారా, వివిధ డైమెన్షన్‌ల మధ్య ప్రయాణించడానికి, విభిన్న డైమెన్షన్‌లకు సంబంధించిన ద్వారాలు తెరవడానికి సహాయపడే అమెనోమినాకా.. శత్రువు చనిపోయే వరకు ఆరిపోని నల్లని జ్వాలలైన అమటెరాసు ఉన్నాయి. అతని వద్ద ఒక పర్ఫెక్ట్ సుసానో ఉంది. దానితో అతను తన ఒక్క కత్తి దెబ్బతో శత్రువులను అంతం చేయగలడు. అతను సిక్స్ పాత్స్ సెంజుట్సు ద్వారా శక్తిని పొందినప్పుడు, సూర్యుడిలా కనిపించే నరుటో యాంగ్ సీల్‌ (సూర్యుడిలా) తో పాటు, కాగుయాను బంధించి చంపడంలో చాలా ముఖ్యమైన, నల్లటి చంద్రుడిలా కనిపించే యిన్ సీల్ (చంద్రుడిలా) అనే ముద్రను కూడా పొందాడు. అయితే, కాగుయాపై భయంకరమైన సిక్స్ పాత్స్ (మైథాలజీ) ఉపయోగించినప్పుడు అతను ఆ ముద్రను కోల్పోయాడు. కాగుయాపై ఆజుట్సును ఉపయోగించినప్పుడు తన ముద్రను కూడా పోగొట్టుకున్నాడు. కొన్ని కారణాల వలన సాసుకే సొంత అన్నయ్యని చంపాల్సి వస్తుంది. అలాగే అతని వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోతోంది. ఐతే చనిపోయే టైములో ఇటాచి తన తమ్ముడికి ‘ఐ ఆల్వేస్ లవ్ యు’ అని చెప్పి మరణిస్తాడు. ఇక తన వంశంలో ఏకైక సభ్యుడిగా మిగలడం వలన, సాసుకే ‘ది లాస్ట్ ఉచిహా’ అనే ముద్దు పేరుతో బాగా పాపులర్ అయ్యాడు.’’
థ్రిల్లర్, యాక్షన్ కంటెంట్ ని ఇష్టపడేవాళ్లను నేను ఈ బుక్ చదవమని కోరుతున్నాను.

Chandrahas

చంద్రహాస్, 7వ తరగతి,
చిట్టూరి హైస్కూల్, విజయవాడ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్