శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గడ్డి మేయని ఆవు

14 నవంబర్, 2026

గడ్డి మేయని ఆవు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చిలాపూర్ అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పేరు రాజయ్య. అతని దగ్గర ఒక మంచి ఆవు ఉండేది. ఆవును ఎప్పుడూ శుభ్రంగా ఉంచేవాడు. ఆవు రోజూ పాలు ఇచ్చేది. ఆవు పాలతోనే రాజయ్య కుటుంబం జీవనం సాగేది. ఒకరోజు రాజయ్య ఆవును మేపడానికి చెరువు గట్టుకు తీసుకువెళ్లాడు. ఆవు గడ్డి మేయలేదు. రాజయ్య కంగారుపడుతూ పశువుల డాక్టర్‌కు ఫోన్ చేశాడు. ‘సార్, మా ఆవు గడ్డి మేయడం లేదు’ అని చెప్పాడు. ‘ఒక గంటలో మీ ఊరికి వస్తాను’ అని డాక్టర్ ఊరికి వచ్చారు. ఆవును పరీక్షించకుండానే డాక్టరుకు పరిస్థితి అర్థమైంది. రాజయ్యను పిలిచి ‘మీ ఆవు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు తినడం వల్ల గడ్డి మేయడం లేదు. మీ ఊరికి వచ్చేటప్పుడు దారిలో అంతా ప్లాస్టిక్ చెత్త కనిపించింది. అదే సమస్య’ అని డాక్టరు చెప్పారు. రాజయ్య భయంతో ‘ఇప్పుడు ఎలా డాక్టరు? ఏం చేయాలి?’ అన్నాడు. ‘ముందు ఆవుకు ఆపరేషన్ చేసి కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలి. ఆ తరువాత ఊళ్లో వాళ్లతో మాట్లాడి ప్లాస్టిక్ చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దని చెప్పాలి’ అన్నారు. ఆపరేషన్ తరువాత ఆవు గడ్డి మేయడం మొదలెట్టింది. రాజయ్య ఊరందరితో ఆవు గురించి చెబుతూ ‘ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు, చెరువులో పడవేయవద్దు. చెత్త కుండీల్లో వేయాలి. మూగజీవుల ప్రాణాల మీదకు తేవద్దు’ అని ప్రచారం చేశాడు.


- పి. అవినాష్, 9వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

అనంతసాగర్, సిద్దిపేట జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్