శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుర్రం తెలివి

15 నవంబర్, 2026

Clever Horse and Roaring Lion(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒక రాజు దగ్గర ఒక ముసలి గుర్రం ఉండేది. అది పని చేయలేనంత ముసలిది అయిపోయింది. దాని కాళ్లకు నాడాలు కట్టి, అడవిలో వదిలే‌శారు. అది పచ్చని మైదానంలో రోజూ గడ్డి తింటూ ఉంటుంది. ఒకరోజు ఒక సింహం గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. దాన్ని ఎలాగైనా తినాలని అనుకుంది. ‘నీవెవరివి?’ అని అడిగింది సింహం. దానికి గుర్రం ‘నేను రాజు గారి గుర్రాన్ని, ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి ఏ పని లేక ఇక్కడ తింటూ తిరుగుతున్నాను. ‘మరి నువ్వెవరు?’ అని అడుగుతుంది గుర్రం. ‘నేను సింహాన్ని ఈ అడివికి, ఈ జంతువులకు రాజును, తలుచుకుంటే నేను నిన్ను తినేస్తాను’ అన్నది సింహం. ‘నేను రాజుగారి గుర్రాన్ని, నన్ను తినడానికి చాలా బలం కావాలి’ అంది గుర్రం. ‘జంతువులలోని అన్నిటికన్నా నేనే బలమైనదాన్ని’ అని గర్జించింది సింహం. లోపల భయపడుతున్నా గుర్రం ఏదైనా ఒక ఉపాయంతో తప్పించుకోవాలని ఆలోచిస్తుంది.

‘నా బలాన్ని ఇప్పటివరకు నువ్వు చూడలేదు కదా! ఎవరు బలవంతులో చూద్దాం’ అంది గుర్రం. సరే అంటుంది సింహం. ‘అయితే ఒక పని చెయ్యి అక్కడ ఉన్న పెద్ద రాయి కనపడుతుందా, ఆ రాయి నుండి రవ్వలు తెప్పించ గలిగినవారు బలవంతులు’ అంది సింహంతో గుర్రం. అలాగే అని ఒప్పుకుంటుంది సింహం. రాయిపై తన పంజాతో గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు సింహం గోర్లు విరిగాయి కానీ రవ్వలు రాలేదు. అది చూసి గుర్రం నీకు ఏ మాత్రం బలం లేదు, నా బలమేమిటో ఇప్పుడు చూడు అంది గుర్రం. రాయి దగ్గరకు వెళ్లి, గుర్రం నాడలతో గట్టిగ తన్నింది.. ఒక్కసారిగా రవ్వలు ఎగిసిపడ్డాయి. ఇది మామూలు జంతువు కాదు, దీనితో పెట్టుకోకూడదు అనుకొని పారిపోతుంది సింహం. అది చూసి తనలో తాను నవ్వుకుంది గుర్రం.

​

చుష్మ

7 వ తరగతి, గురుకుల పాఠశాల,

జడ్చర్ల, మహబూబ్ నగర్.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్