ఒకసారి సోషల్ మాస్టారుకు తన తరగతి పిల్లలందరిలో నిజాయితీగా ఉండే పిల్లలు ఎవరో తెలుసుకోవాలి అనిపించింది. అందరికీ కొన్ని విత్తనాలను ఇచ్చి ఇంటిదగ్గర కుండీల్లో ఆ విత్తనాలు వేసి పూల మొక్కలు పెంచాలని చెప్పారు. కొన్ని రోజుల తరువాత పిల్లలు అందమైన పూల కుండీలను తెచ్చారు. కానీ రాము అనే అబ్బాయి మాత్రం పూల కుండీని తీసుకురాలేదు. మాస్టారు చెప్పినట్లు తన కుండీలో పూల మొక్క పెరగలేదని భయపడుతూ వచ్చాడు.
మాస్టారు అందరి కుండీలను చూశారు. రాము దగ్గరకు వచ్చి ఆగిపోయారు. రాముకు చాలా భయమేసింది. మాస్టారు మాత్రం నవ్వుతూ రాము భుజంపై చెయ్యి వేశారు. అందరివైపు తిరిగి ‘మీ అందరిలో రాము ఒక్కడే నిజాయితీపరుడు’ అని చెప్పారు. ‘అదెలా? చెబుతారా? రాము మా అందరిలా పూల మొక్కను పెంచలేదు. అయినా తనే ఎలా నిజాయితీపరుడు?’ అని పిల్లలు అడిగారు. అప్పుడు మాస్టారు ‘నేను ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టినవి. అవి మొలకెత్తవు. కాబట్టి రామునే నిజాయితీపరుడు’ అని చెప్పారు.

- పి. నిహారిక, 6వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)