సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గణితంతో గమ్మత్తులు

20 గంటల క్రితం

maths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక ధనవంతుడు తన కొడుకు పెళ్లి చేస్తున్నాడు. భోజన ఏర్పాట్లు కూడా చాలా భారీగా చేశాడు. ఈ ఫంక్షన్‌కు ఆహ్వానం లేనివారు వచ్చేస్తారని ఉద్దేశంతో అతిథుల కోసం ఆ కుటుంబం ఒక గణిత పజిల్‌ను ఉపయోగించింది. గేట్ దగ్గర ఫంక్షన్‌కు సంబంధించిన ఒక వ్యక్తిని గేట్‌మ్యాన్‌గా ఉంచి, వచ్చే అతిథులకు స్వాగతం చెబుతూ, వారికి ఒక సంఖ్య చూపిస్తే వారు కూడా ఒక సంఖ్య చెబుతున్నారు. అది కరెక్ట్ అయితే వెంటనే ఆ వ్యక్తి వారికి "ఎస్" అని చెప్పి లోపలకు పంపిస్తున్నాడు. ఇదంతా గమనించిన ఓ అపరిచిత వ్యక్తి గేట్ దగ్గరకు వెళ్లి చాటుగా నిలబడి ఆ వ్యవహారాన్ని గమనించాడు.


ఫంక్షన్‌కు వచ్చిన ఒక అతిథికి గేట్‌మ్యాన్ ‘6’ సంఖ్య చూపించగా, అతిథి ‘3’ అని చెప్పాడు. మరో అతిథికి ‘12’ సంఖ్య చూపించగా, అతను ‘6’ అని చెప్పాడు. ఆ ఇద్దరినీ గేట్ దగ్గర ఉన్న వ్యక్తి లోపలికి పంపించాడు. ఈ విషయం అంతా చూసిన అపరిచిత వ్యక్తి, "అతను ఏ సంఖ్య చూపించినా మనం దానిలో సగం చెబితే సరిపోతుంది" అనుకున్నాడు. ఇంటికి వచ్చి కొత్త బట్టలు వేసుకొని, భార్యతో కలిసి ఫంక్షన్‌కు బయలుదేరాడు. అక్కడ వీళ్లకు కూడా ఆ గేట్‌మ్యాన్ అందరినీ అడిగినట్లే ‘4’ సంఖ్య చూపించాడు. వెంటనే అపరిచిత వ్యక్తి ‘2’ అని సమాధానం చెప్పి ధీమాగా లోనికి వెళ్లబోయాడు. అప్పుడు గేట్‌మ్యాన్, "ఇది తప్పు సమాధానం. ఈ పెళ్లికి మీకు ఆహ్వానం లేదు. దయచేసి బయటికి వెళ్లిపోండి" అని చెప్పాడు.


పిల్లలూ, ఇప్పుడు చెప్పండి... ఆ గేట్‌మ్యాన్ చూపిస్తున్న సంఖ్యల కోడింగ్, డీకోడింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు అపరిచిత వ్యక్తి కుటుంబాన్ని లోపలకు పంపలేదు?


జవాబు: 4.

వివరణ: చాలామంది "గేట్‌మ్యాన్ చూపిస్తున్న సంఖ్యలో సగం చెబితే సరిపోతుంది" అనుకుంటారు. అది తప్పు. అసలు విషయం ఏమిటంటే, గేట్‌మ్యాన్ చూపిస్తున్న సంఖ్యను ఇంగ్లీషులో ఎలా స్పెల్లింగ్ చేస్తారో చూసి, అందులో ఉన్న అక్షరాల సంఖ్యనే డీకోడ్‌గా చెప్పాలి.

మొదటి వ్యక్తికి 6 (SIX) చూపించగా, దానిలో మూడు అక్షరాలు ఉన్నాయి. కాబట్టి 6 = 3.

రెండవ వ్యక్తికి 12 (TWELVE) చూపించగా, దానిలో ఆరు అక్షరాలు ఉన్నాయి. కాబట్టి 12 = 6.

అపరిచిత వ్యక్తికి 4 (FOUR) సంఖ్య చూపించగా, దాని సరైన డీకోడ్ 4 అవుతుంది. ఎందుకంటే FOUR అనే పదంలో నాలుగు అక్షరాలు ఉన్నాయి. అంటే 4 = 4. అందుకే అతను ‘2’ అని చెప్పడంతో గేట్‌మ్యాన్ అది తప్పు సమాధానమని చెప్పి లోపలకు అనుమతించలేదు.


– మడ్డు తిరుపతిరావు

గణిత అవధాని & టీచర్

బూరగాం, కంచిలి, శ్రీకాకుళం జిల్లా

94913 26473



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్