బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒకరికి ఒకరు సహాయం

2 గంటల క్రితం

ఒకరికి ఒకరు సహాయం image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 05:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాము చాలా మంచివాడు. ఒకరోజు రాము పాఠశాలకు వెళ్తుండగా దారిలో ఒక చిన్న పక్షి కింద పడి ఉండటం చూశాడు. ఆ పక్షికి గాయం అయ్యింది. రాము వెంటనే ఆ పక్షిని జాగ్రత్తగా తీసుకుని నీళ్లు ఇచ్చి దానికి మంచి చోటు కల్పించాడు. కొన్ని రోజుల వరకు దాన్ని చూసుకున్నాడు. పక్షి కోలుకుంది. రాము దాన్ని ఆకాశంలోకి వదిలాడు. పక్షి సంతోషంగా పైకి ఎగిరిపోయింది. ఒకసారి వేసవి సెలవుల్లో రాము వాళ్ల ఊరు పక్కనే ఉన్న అడవిలోకి కట్టెల కోసం వెళ్లాడు. సాయంత్రం అయ్యేసరికి గ్రామానికి బయల్దేరాడు. కొంత దూరం వచ్చాక అడవిలో దారి తప్పిపోయాడు. అప్పుడు ఆ రోజు రాము సాయం చేసిన పక్షి గూడుకు వస్తూ తనను చూసింది. రాము భుజంపై ప్రేమగా వాలింది. పక్షిని చూసి రాము సంతోషపడినా, దారి తప్పిపోయినందుకు భయపడ్డాడు. అది గ్రహించిన పక్షి, రాముకు దారి చూపించింది. రాము క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

ఒకరికి ఒకరు సహాయం image 1

- కె. రాహుల్,

9వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

అనంత సాగర్, సిద్దిపేట జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్