mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రపంచ శాంతి

4 రోజుల క్రితం

santhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిన్న గ్రామంలో రాజు, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ కలిసి చదువుకోవడం, ఆడుకోవడం చేసేవారు. కానీ ఒకరోజు పాఠశాలలో జరిగిన చిన్న అపార్థం కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో వాళ్లు మాట్లాడుకోవడం మానేశారు. వారి స్నేహం ఇలా విరిగిపోవడం చూసి టీచర్ చాలా బాధపడ్డారు.
వాళ్లద్దరిలో మళ్లీ స్నేహం చిగురించేలా చేయాలని అనుకున్నారు. మరుసటి రోజు టీచర్ తరగతి గదికి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొచ్చారు. అందరి ముందూ ఆ గిన్నెలో ఒక చిన్నరాయిని వేశారు. వెంటనే నీళ్లలో బుడగల వంటి కదలికలు ఏర్పడ్డాయి. అప్పుడు టీచర్ పిల్లలను చూసి, ‘చిన్న రాయి కూడా నీటిలో అలజడి సృష్టిస్తుంది. అలాగే మన చిన్న కోపం, చిన్న గొడవ కూడా కుటుంబాల్లో, పాఠశాలల్లో, సమాజంలో అశాంతికి కారణమవుతుంది` అని చెప్పారు. తర్వాత ఆమె ఒక అందమైన పువ్వును ఆ నీళ్లపై నెమ్మదిగా ఉంచారు. కొద్దిసేపటికి నీళ్లు మళ్లీ ప్రశాంతంగా కనిపించాయి. అప్పుడు టీచర్ ‘ప్రేమ, సహనం, క్షమ.. ఇవే నిజమైన శాంతికి పునాదులు. మనమందరం కలిసిమెలిసి ఉంటే ప్రపంచం ఆనందం, శాంతితో నిండిపోతుంది` అని టీచర్ వివరించారు.
ఆ మాటలు రాజు, గోపి హృదయాలను తాకాయి. వారు తమ తప్పును గుర్తించి, ఒకరినొకరు క్షమించుకున్నారు. మళ్లీ మంచి స్నేహితులయ్యారు. ఆ రోజు నుంచి పాఠశాలలోని పిల్లలందరూ ప్రేమగా, ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

​నీతి: ప్రేమ, స్నేహం, ఐక్యత ఉన్న చోట శాంతి ఉంటుంది. గొడవలు, ద్వేషాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. క్షమ, సహనం ప్రపంచ శాంతికి మార్గం చూపిస్తాయి.

సిహెచ్.దీపు కార్తికేయ
7వ తరగతి, అరవింద మోడల్ స్కూల్, మంగళగిరి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్