ఒక ఊరిలో త్రిష అనే అమ్మాయి ఉండేది. తనకు పదకుండు సంవత్సరాలు. తనకు జంతువులు అంటే చాలా ఇష్టం. కుక్కను పెంచాలని కోరిక. కానీ వాటిని వాళ్ళ ఇంటిలో పెంచడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఒకరోజు త్రిష స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు రోడ్ పక్కన తనకు ఒక కుక్కపిల్ల కనిపించింది. అది చూడటానికి చాలా ముద్దుగా ఉంది. త్రిష అది అక్కడ ఉండడం చూడలేక వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. త్రిష కుక్కపిల్లను తీసుకురావడం వాళ్ళ అమ్మ చూసింది. ‘అది ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసిరా..!` అని వాళ్ళ అమ్మ కోపంగా అన్నది. త్రిష ఏడ్చుకుంటూ ఎక్కడి నుంచి తెచ్చిందో అక్కడే పెట్టేసింది. ఆ రోజు రాత్రి వరకు అలానే ఏడుస్తూ ఉన్నది. వాళ్ళ నాన్న పని నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. త్రిష ఏడవడం చూసి తనకు ఏమయింది అని వాళ్ళ అమ్మను అడిగాడు. వాళ్ళ అమ్మ జరిగిన విషయమంతా ఆయనకి చెప్పింది. ఆయన తన కూతురు కోసం ఆ కుక్కపిల్లను తీసుకువచ్చాడు. త్రిష చాలా సంతోషించింది. వాళ్ళ నాన్నకు థాంక్స్ చెప్పింది. ఆ బుజ్జి కుక్కపిల్లకి ‘ఉష` అని పేరు పెట్టింది_
నీతి : జంతువుల పట్ల మానవత్వం చూపించాలని పిల్లల్ని ప్రోత్సహించాలి.
-బుగత జ్యోతి, 10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రఘుమండ, విజయనగరం జిల్లా









కామెంట్‌లు (0)