ఆనందం అనేది మూడు అక్షరాలు. అయినా అది మన మనసును ఎంతో హాయి పరుస్తుంది. మనలో ఒక చిన్న చిరునవ్వు చూసి అమ్మ ఎంతో ఆనందపడుతుంది కదా! మైనది ఈ లోకంలో ఏముంటుంది?. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండటమే జీవితం. ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆనందంగా వాటన్నింటినీ ఒక చిరునవ్వుతో స్వీకరించడమే కదా మనం చేయాల్సింది. చిన్నచిన్న గెలుపులకు మనం ఎంతో ఆనందించాలి. కానీ, దానికే ఆనందించాలా అని ప్రశ్నించుకుంటే, నీ జీవితం అయిపోతుంది. మన ఆనందం ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఎవరు ఏదో అనుకుంటారని మన సంతోషాన్ని మనమే ఎందుకు చంపుకోవాలి? ఎదుటివారిని తొక్కేసి మనం పైకి రావాలని అనుకునే ఆనందం ఎప్పటికీ నిజమైన ఆనందం కాదు. మనం మన మనసుకు నచ్చినవారితో గడిపిన కొన్ని తీయని జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటప్పుడు వచ్చే ఆనందం వేరే! ఏ దేంట్లో ఇది రాదు కదా!. ఎదుటివారికి సాయం చేసి, వాళ్ళని ఆనందపెడితే, మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది కదా! అదే నిజమైన ఆనందం.


కల్లే నిత్యశ్రీ
9వ తరగతి, ది క్రాస్‌వర్డ్ స్కూల్, గుంటూరు.









కామెంట్‌లు (0)