శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముందు తరాల భవిష్యత్తు ..

23 గంటల క్రితం

చిన్నారి కథ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌,

మా పాఠశాలకు ఇటీవల విజ్ఞాన శాస్త్ర ప్రముఖులైన గంగాధర్ శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన 600 పైన విద్యాసంస్థలకు వెళ్లారు. సార్ మాకు ఎన్నో కొత్త పరికరాలను పరిచయం చేశారు. ముందు తరాల భవిష్యత్తును కాపాడుకొనే చిన్నచిన్న ఉపాయాలు చెప్పారు. అలాగే సార్ చేసిన కొన్ని పరికరాలను చూపించారు. అందులో నాకు నచ్చిన పరికరం పవర్ సేవింగ్ గాడ్జెట్. ఒక బల్బుతో ఆయన తన మేథాశక్తి ఉపయోగించి చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా కాంతి ఇచ్చేటట్టు, కొంచెం వెలుతురుగా ఉన్న చోట తక్కువగా కాంతి ఇచ్చేటట్టు దానిని చేశారు. అలాగే ఆయన చేసిన ఇన్వర్టర్ ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పారు. అలాగే నీళ్లను ఎలా కాపాడుకోవాలి, భూమాతను ఎలా రక్షించాలి అనే విషయాలు చెప్పారు. భావితరాల కోసం సార్ చేస్తున్న కృషి, పట్టుదల నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. సార్ మాతో చెప్పిన మాట 'ఎ డ్రాప్ యూ సేవ్, ఎ డ్రాప్ యూ ప్రొడ్యూస్' అని చెప్పారు. సైంటిఫిక్ స్టూడెంట్స్ అనే సంస్థను నిర్వహిస్తున్న సార్ నాకే కాదు, మా స్నేహితుల్లో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. సార్ తన విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి, మేము కూడా సైన్స్ గురించి ఆలోచించేలా చేశారు. ఇలా మాతో పాటు ఇంకా మరెంతో మంది విద్యార్థులకు సార్ స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను.

- ఎ. లక్ష్మీప్రియ, 8వ తరగతి,

అరవింద మోడల్ స్కూలు,

మంగళగిరి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్