ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారుడు పల్లేటి రాజు మృతదేహం లభ్యం

1 గంట క్రితం

fisher man.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు పల్లేటి రాజు మృతదేహం లభ్యమైంది. మచిలీపట్నం మండలం తాళ్లపాలెం వైఎస్సార్‌ ఫిషర్‌మెన్‌ కాలనీకి చెందిన రాజు శనివారం తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో తాళ్లపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్