ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిలో ఓ మహిళ అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్‌గార్డ్స్ అప్రమత్తమై ఆమెను సురక్షితంగా రక్షించారు. రైల్వే న్యూ కాలనీకి చెందిన ఓ కుటుంబం యారాడ బీచ్‌ను సందర్శించేందుకు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల ఉధృతి పెరగడంతో సూర్యలక్ష్మి (55) నీటిలో మునిగిపోతుండటాన్ని లైఫ్‌గార్డ్స్ గమనించారు. వెంటనే స్పందించిన లైఫ్‌గార్డ్స్ కదిరి లావరాజ్, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్ సముద్రంలోకి వెళ్లి సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. లైఫ్‌గార్డ్స్ సకాలంలో అప్రమత్తమై చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వారి చొరవను కుటుంబ సభ్యులు అభినందించారు.
యారాడ బీచ్‌లో పెను తప్పిన ప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)