వేకవరీ (అల్లూరి) : వేకవరీ గ్రామంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కలవర్ట్ ను వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ .... శుక్రవారం సిపిఎం బైక్ ర్యాలీ బృందం పరిశీలన చేపట్టింది. ఈ బైక్ బృందానికి బుర్కానకోట గ్రామాలలో గిరిజన కోయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మలలో జిల్లా కార్యదర్శి బొప్పెనా కిరణ్ లోత రామారావు ప్రసంగించారు. చింతూరు మండలం ఏడుగురాళ్ల పల్లి గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. తుమ్మల గ్రామంలో కామ్రేడ్ పట్రా ముత్యం స్మరక స్తూపం వద్ద నాయకులు నివాళులర్పించారు. ఈ బైక్ యాత్ర కు తుమ్మల గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ తుమ్మల గ్రామంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు లోకానాధం మాట్లాడారు. తుమ్మల గ్రామంలో లోని సమావేశంలో లోత రామారావు ప్రసంగించారు. తుమ్మల గ్రామంలో కామ్రేడ్స్ పట్న ముత్యం స్తూపం దగ్గర లోతా రామారావు జెండాను ఆవిష్కరించారు. వేటపాక మండలం నుంచి చింతూరు మండలానికి బైక్ ర్యాలీ చేరుకుంది.















కామెంట్లు (0)