బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి

1 గంట క్రితం

alluri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పెదబయలు : అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి భానుమర్తి రాజు బుధవారం మధ్యాహ్నం స్థానిక బాలురరెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించారు. అనంతరం పదవతరగతి ఏ, బి తరగతుల గదులలో వెళ్లి మిషన్‌ మార్చ్ 2027 ఎఫ్ ఏ 1 మార్క్స్, అందులో షైనింగ్‌ స్టార్స్‌, రైజింగ్ స్టార్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పది పరీక్షల్లో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు. ప్రవర్తన, మంచి నడవడిక ఉన్న విద్యార్థులకు ప్రతి సోమవారం అసెంబ్లీ లో ప్రోత్సాహబహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలన్నారు. ఏ ఎస్ ఆర్ నాట్య సంఘం 2026 లో భాగంగా నాట్య రంగంలో ఎంపిక చేసి మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి పంపించే ఏర్పాట్లు చెయ్యాలన్నారు. తరగతులకు గైర్హాజరు కాకుండా చూడాలని ప్రిన్సిపాల్ డి ఎస్ శంకర్ రావుకు సూచించారు. ఫేషియల్‌ హాజరు నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచలన్నారు. విద్యార్థులకు యోగాతో పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపరచాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్