ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోరాటాలే గెలిపించాయి

14 నవంబర్, 2026

పోరాటాలే గెలిపించాయి
సిపిఎం జెడ్‌పిటిసి త్రినాథ్‌కు ఘన సన్మానం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం జెడ్‌పిటిసి త్రినాథ్‌కు ఘన సన్మానం

ప్రజాశక్తి - ముంచంగిపుట్టు: అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం ​సిపిఎం జెడ్‌పిటిసి కొర్రా త్రినాథ్ ను శనివారం ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మన్న పడాల్, బలదేవ్ లు ఆ పార్టీ కార్యాలయం వద్ద పూలమాలలు వేసి, ఘనంగా సన్మానించారు. ఆదివాసీ హక్కులు, చట్టాలు అమలు, ఆదివాసుల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతున్న త్రినాథ్ ను జెడ్పిటిసి గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివాసి గిరిజన ప్రాంతంలో ఆదివాసి హక్కులు, చట్టాలు క్రమేపి ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు పూనుకున్న నేపథ్యంలో వాటి పరిరక్ష‍ణకు పోరాడుతున్న సిపిఎం నేత కొర్రా త్రినాథ్ ను జడ్పిటిసిగా అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మండల ప్రజలకు సిపిఎం మండల కమిటీ రుణపడి ఉంటుందన్నారు. జీఓ-3కు బదులుగా ప్రత్యామ్నయ జీవో కోసం పోరాటం, 1/70 చట్టం పరిరక్షణ, పీఎం జన్మన్ గృహాల బకాయిలు, పీఎం జన్మన్ పథకంలోని 12రకాల అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని, కాఫీ రైతులకు నిధులు విడుదల చేయాలని, మాతృభాష విద్యా వాలంటరీల సమస్యలు పరిష్కారం చేయాలని అనేక దపాలుగా ఆదివాసి గిరిజను పోరాటాల్లో సిపిఎం కీలక పాత్ర పోషించారన్నారు. ఆదివాసి ప్రజా పోరాటాలే మండల జడ్పిటిసిగా కొర్రా త్రినాథ్ గెలుపుకు బాటలు వేసిందన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం జిల్లా పరిషత్ లో ప్రజల గొంతుకను బలంగా వినిపించి ఆదివాసుల పక్షాన పోరాటం కొనసాగించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు గిరిజన ప్రాంతంలో గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్ అమలుకై ,1/70 చట్టం పరిరక్షణ కోసం ఆదివాసీ గిరిజన సంఘం పోరాటం నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎంఎం శ్రీను ,కొర్రా నర్సయ్య, దోంబ్రు, నారాయణ, రాందాస్, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్ఈశ్వరి, విజయ, మండల మాజీ వైస్ ఎంపీపీ పాటు పోయి సత్యనారాయణ, సిపిఎం మండల కమిటీ నాయకులు లైకోన్, గణపతి, జీనబంధు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్