శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం : జిల్లా కలెక్టర్ నిశాంతి

1 గంట క్రితం

గాంధీజీ ఆశయాలు  స్ఫూర్తిదాయకం
జిల్లా కలెక్టర్ నిశాంతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి ఉద్ఘాటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాడేరు మోడకొండమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతితో పాటు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్ కె. సాహెత్, మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, రాష్ట్ర స్ట్రైకర్ చైర్మన్ కుడా కృష్ణారావు తదితరులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం, స్వచ్ఛత, సరళ జీవనం, సామాజిక సమానత్వం, సేవా భావం వంటి విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.


గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ప్రజల సంక్షేమం, సామాజిక సమైక్యత, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన పౌర జీవనం కోసం ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, గాంధీజీ ప్రబోధించిన సేవా స్ఫూర్తి, గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత, సామాజిక బాధ్యత వంటి విలువలను అధికారులు తమ విధుల్లో ప్రతిబింబింపజేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డీఎల్‌పీఓ పి.ఎస్. కుమార్, జయ ప్రకాష్, ఆర్ అండ్ బీ ఈఈ నాగేశ్వరరావు, పీడీ డీఆర్‌డీఏ జయకృష్ణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రియాజ్ బైగ్తో పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్