శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​అరకు వ్యాలీలో ప్రజాసంఘాల భారీ నిరసన...

1 గంట క్రితం

​ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి!
​అరకు వ్యాలీలో సిఐటియు, రైతు, గిరిజన ప్రజాసంఘాల భారీ నిరసన... బొమ్మ దగ్ధం అడ్డుకునేందుకు పోలీసుల తీవ్ర యత్నం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అరకులోయ:

​

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిఐటియు వివిధ రైతు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా డిమాండ్ చేశారు. నిరసన పిలుపులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండల కేంద్రంలో శనివారం నిరసన కార్యక్రమం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాసంఘ నాయకులతో పోలీసులు అనవసరంగా వాగ్వాదానికి దిగి, కార్యక్రమాన్ని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేయడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​అంతకుముందు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని, బిజెపి ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడుతున్న జ్ఞానేశ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


​పోరాటాలకు భయపడే అమిత్ షా, మోదీ ఉద్యమాలను అడ్డుకుంటున్నారు: వి. ఉమామహేశ్వరరావు

​కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ​దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రజాస్వామ్యయుత నిరసనలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అణచివేయాలని చూడటం దారుణం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను సైతం తృణప్రాయంగా తిరస్కరిస్తోందన్నారు . ఢిల్లీకి నిరసనకారులు రాకుండా మెట్రో సేవలు, ఇతర రవాణా వ్యవస్థలను రద్దు చేయడం బిజెపి భయానికి నిదర్శనం.

​కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రజా ఉద్యమాలను చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు . తప్పు చేసింది జ్ఞానేశ్ కుమార్ అయితే, ఆయనను కాపాడటానికి బిజెపికి ఎందుకు అంత భయం పుట్టుకొస్తుందో సమాధానం చెప్పాలన్నారు.దేశంలో అర్హులైన 13 కోట్ల మంది ఓట్లను విచక్షణారహితంగా తొలగించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమన్నారు . తక్షణమే తొలగించిన అర్హులైన ఓటర్ల ఓట్లను పునరుద్ధరించాలని,ప్రస్తుత ఎలక్షన్ ప్రక్రియను నిలిపివేయాలన్నారు.

​

​ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్య విరుద్ధం: జి. చిన్నబాబు, పి. బాలదేవ్:

​ఈ నిరసనను ఉద్దేశించి ఎపి కాఫీ రైతు సంఘం కార్యదర్శి జి. చిన్నబాబు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. బాలదేవ్ మాట్లాడుతూ, ​రాష్ట్రంలోనే ఏకంగా 45 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు.రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా నిరసన తెలుపుకునే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు . ప్రశ్నించే ప్రజాసంఘాల, పోరాడే వారి గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోం అన్నారు.ప్రభుత్వాల అణచివేత చర్యలతో ఉద్యమాలు ఆగిపోవు, రాబోయే రోజుల్లో పోరాటాలు మరింత ఉధృతం అవుతాయన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు.


ఈ భారీ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు, మగ్గన్న, కోటేశ్వరరావు, మహదేవ్, రైతు సంఘం, గిరిజన సంఘం నాయకులు జగన్నాథం, హరి, సిపిఎం మండల కార్యదర్శి రామారావులతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్