ప్రజాశక్తి – మారేడుమిల్లి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మారేడుమిల్లి మండలానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, మారేడుమిల్లి మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ గొర్ల బాలాజీబాబు, అందాల సోమిరెడ్డి, నూతనంగా జడ్పీటీసీగా ఎన్నికైన గొర్ల మురళీకృష్ణ తదితరులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా విజయం సాధించిన గొర్ల మురళీకృష్ణను ఈ సందర్భంగా వైఎస్ జగన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించినట్లు తెలిపారు. మారేడుమిల్లి మండలంలో పార్టీ కార్యకలాపాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై నాయకులు ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)