ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చేనెలాఖరుకు భవన నిర్మాణాల పూర్తి - ఎపిఇఇడబ్ల్యుఐడిసి ఎస్ఇ శివకుమార్

11 నవంబర్, 2026

వచ్చేనెలాఖరుకు భవన నిర్మాణాల పూర్తి
- ఎపిఇఇడబ్ల్యుఐడిసి ఎస్ఇ శివకుమార్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -సీలేరు

పీఎం జన్‌‌మన్‌ ‌పథకంలో పాఠశాలల వసతి భవన నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని ఎపివిద్యా సంక్షేమ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ (ఎపిఇఇడబ్ల్యుఐడిసి) ఎస్ఇ శివకుమార్ వెల్లడించారు. బుధవారం సీలేరులో పర్యటించి, బాలికల ఆశ్రమ పాఠశాల వసతి భవనం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో ఎపిఇఇడబ్ల్యుఐడిసి ఆధ్వర్యంలో 60 భవనాలు, సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 23 భవనాలు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రూ.2. 75 లక్షల వ్యయంతో ఒక్కో భవన నిర్మాణం చేపడుతున్నామని, ఇవన్నీ డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఎనిమిది భవనాలు సాంకేతిక , తర కారణాలు వల్ల జాప్యం జరుగుతుందన్నారు. మిగతా భవనాలు నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే 23 భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో స్థలకేటాయింపులో ఎపి జెన్‌‌కో అధికారులు అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లు ఆదేశించారు. కార్యక్రమంలో ఇఇ జెజి ప్రసాద్, ఎఇఇ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్