అల్లూరి సీతారామరాజు జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ) ఎన్నికలను ఈ నెల 19వ తేదీన సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియను ఈనెల 20వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఆయా మండలాల కో-ఆప్టెడ్ సభ్యులు సంబంధిత మండల పరిషత్ కార్యాలయాలకు ఉదయం 10 గంటలలోపు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన నామినేషన్ల ప్రచురణ ప్రక్రియ చేపడతారని అన్నారు . అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించిన అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ చేపడతారన్నారు.ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లయితే వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే ఓటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీ ఉన్న సందర్భంలో ఓటింగ్‌తో కూడిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియను 20వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే సంబంధిత సభ్యులు ఉదయం 10 గంటలలోపు జిల్లా కలెక్టరేట్‌కు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన నామినేషన్ల ప్రచురణ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియ చేపడతారు.ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే ఓటింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీ ఉన్న సందర్భంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియలను నిర్ణీత సమయపాలనతో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.








కామెంట్‌లు (0)