శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాఫీ రైతుల సంక్షేమానికి పెద్దపీట- గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ రెడ్డి

18 నవంబర్, 2026

కాఫీ రైతుల సంక్షేమానికి పెద్దపీట
 గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ రెడ్డి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పాడేరు

కాఫీ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డి మురళీధర్ రెడ్డి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, వైద్య సేవల బలోపేతం, క్రీడా రంగంలో యువతకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాడేరు ఏజెన్సీలో పర్యటించి, జిల్లాలోఅత్యవసర అంబులెన్స్ సేవలు, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, తలారసింగి హైస్కూల్ ప్రాంగణంలో ఆర్చరీ అకాడమీ, చింతపల్లి ఎకో కాఫీ పల్పింగ్ యూనిట్ల, జి మాడుగులలో నిర్మాణ చేపడుతున్న కాఫీ పల్పింగ్ యూనిట్ పనులను స్థానిక ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ,సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. .

గిరిజన ప్రాంతాల్లో ప్రసవాలు, పాము కాట్లు, రోడ్డు ప్రమాదాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు వినియోగం, సమయానికి సేవలు అందకపోవడానికి గల కారణాలు, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్లక్ష్యానికి చెక్ పెట్టేలా డిఎంహెచ్‌ఒ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రెండు నెలలుగా విజయవంతంగా సేవలు అందిస్తోందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం 92 అంబులెన్సులను 50 రెగ్యులర్, 42 ఫీడర్/టూ వీలర్ అంబులెన్సులు ఒకే వేదికపైకి తెచ్చి, 'ఉబర్/ఓలా' టెక్నాలజీ తరహాలో లైవ్ జీపీఎస్ ట్రాకింగ్‌తో అనుసంధానించామన్నారు.

ఏ సమయంలో ఏ అంబులెన్స్ అందుబాటులో ఉంది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, అనే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రోగులకు అతి తక్కువ సమయంలో సేవలు అందించేలా డ్రైవర్ యాప్ డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు తెలిపారు.

గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహం, ఆర్చరీ అకాడమీ పరిశీలన,

స్థానిక గిరిజన విద్యార్థులు, యువత క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్చరీ అకాడమీని సందర్శించి, అకాడమీ నిర్వహణ, శిక్షణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో టాలెంట్ ఉన్న క్రీడాకారులను గుర్తించి, ప్రొఫెషనల్ రికర్వ్ కాంపౌండ్ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చడం ద్వారా ఎక్కువ మంది శిక్షణ పొంది, మరిన్ని పతకాలు సాధించేలా తగిన వసతులు కల్పిస్తున్నట్లు అల్లూరి ఆర్చరీ హెడ్ కోచ్ ఎ. సుధాకర్ తెలిపారు.

జి మాడుగులలో కాఫీ రైతుల కోసం నిర్మిస్తున్న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, గోడౌన్ల నిర్మాణం నవంబర్ నుంచి జనవరి వరకు జరిగే కాఫీ హార్వెస్ట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, రైతుల సౌకర్యార్థం, నిర్మిస్తున్న కాఫీ పల్పింగ్, ప్రాసెసింగ్ యూనిట్, గోడౌన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కాఫీ ప్రాసెసింగ్ నిర్మాణ ప్రాంతంలో సీజన్ సమయంలో వచ్చే వందలాది మంది స్థానిక కార్మికులు మహిళల సౌకర్యం కోసం కామన్ టాయిలెట్లు, వెట్ పార్చిమెంట్ డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు, మిషనరీ ఎరెక్షన్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చింతపల్లి వైటిసిలో శిక్షణ పొందుతూన్న వారిని శిక్షణ లోటుపాట్లు, సమస్యల పై అరా తీసి అడిగి తెలుసుకున్నారు. తాజంగిలో నిర్మిస్తున్న ట్రైబల్ మ్యూజియం పనులను పరిశీలించి, నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలని,ఆదేశించారు పర్యటనలో ఐటిడిఎ ఎపిఒ (పివిటిజి ) వెంకటేశ్వరరావు, కాఫీ బోర్డ్ ఎడిఅయoతి , ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ వేణుగోపాల్ ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్