శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్లూరి జెడ్‌పి ఎన్నిక ఏకగ్రీవం- చైర్ పర్సన్ గా వంతల శాంతి కుమారి

20 నవంబర్, 2026

అల్లూరి జెడ్‌పి ఎన్నిక ఏకగ్రీవం
చైర్ పర్సన్ గా వంతల శాంతి కుమారి 
వైస్ చైర్మన్ గా సీధరి రాంబాబు 
రెండు పీఠాలు వైసిపి కైవసం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అల్లూరి జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ఈ జడ్పీ చైర్పర్సన్ ఎన్నికను జిల్లా కలెక్టర్ నిశాంతి టి అధ్యక్షతన నిర్వహించారు.జిల్లాలోని 11 జడ్పిటిసి స్థానాలకు గాను 7 మెజారిటీ స్థానాలు సాధించి ఆదిక్యం లో ఉన్న వైసీపీ సభ్యులు పార్టీ అధిష్టానం సూచన మేరకు చైర్ పర్సన్ వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఈ ఎన్నిక ముగిసింది. ముందుగా జిల్లాలోని 11 మండలాల జడ్పిటిసి సభ్యుల తో జిల్లా కలెక్టర్ టీ నిశాంతి, జడ్పీ సీఈవో పి. వాసుదేవరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్ ఎన్నికకు నామినేషన్లు ఆహ్వానించారు. జీకే వీధి జడ్పిటిసి గా ఎన్నికైన కంకిపాటి గిరి ప్రసాద్ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పెదబయలు జడ్పిటిసి సభ్యురాలు వంతల శాంతి పేరును ప్రతిపాదించగా అనంతగిరి జడ్పిటిసి సభ్యురాలు దూరు జయవర్ధిని బలపరిచారు. దీంతో మరొక ప్రతిపాదన లేకపోవడంతో వంతల శాంతి చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రకటించారు.

అనంతరం వైస్ చైర్మన్ గా పాడేరు జడ్పిటిసి సీదరి రాంబాబు పేరును చింతపల్లి జడ్పిటిసి సభ్యురాలు అనూష దేవి ప్రతిపాదించగా డుంబ్రిగూడ జడ్పిటిసి కిముడు హరి బలపరచడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది. దీంతో కలెక్టర్ రాంబాబు పేరును వైస్ చైర్మన్ గా ప్రకటించారు. జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక అనంతరం ప్రమాణస్వీకారం పూర్తిచేసి ఎన్నికైన ధ్రువపత్రాలను అందజేశారు. వీరికి జిల్లా కలెక్టర్ నిశాంతి తో పాటు అల్లూరి జడ్పీ సీఈవో వాసుదేవరావు, అరకు లోయ ఎంపీ డాక్టర్ తనుజరాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, పాడేరు, అరకు, ఎమ్మెల్యేలు ఎం విశ్వేశ్వర రాజు, రేగం మత్స్య లింగం తదితరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రోనంకి కూర్మనాద్, డి ఎల్ పి ఓ, పి ఎస్ కుమార్, ముంచంగిపుట్టు సిపిఎం జడ్పిటిసి కొర్ర త్రినాథ్ తో పాటు టిడిపి , వైసిపి జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్