మండలంలో హెచ్‌పి గ్యాస్ వినియోగదారులంతా తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలని చింతపల్లి జిసిసి మేనేజర్ సుగునాధం తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు చింతపల్లి జిసిసి ద్వారా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. శనివారం కొయ్యూరులో జరిగిన గ్యాస్ పంపిణీ సందర్భంగా ఇకెవైసి చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని సిబ్బంది తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ప్రతి వినియోగదారుడికి తప్పనిసరిగా గ్యాస్ అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మేనేజర్ సుగునాదం తెలిపారు. గ్యాస్ పంపిణిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.







కామెంట్‌లు (0)