శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరవాడ మండలానికి అరుదైన గౌరవం !

20 నవంబర్, 2026

A rare honor for Parawada mandal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

* అనకాపల్లి జిల్లా జడ్పీ పీఠంపై పరవాడకు ఆశలు

* జడ్పీ చైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణికి అవకాశం ?

* 24 మండలాల్లో పరవాడకు ప్రత్యేక గుర్తింపు

* రావాడ గ్రామానికి దక్కనున్న అరుదైన గౌరవం


ప్రజాశక్తి-పరవాడ (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం పరవాడ మండలానికి దక్కే అవకాశాలు కనిపిస్తుండటంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలోని 24 మండలాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, పరవాడ మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన మోటూరు నాగమణికి అత్యున్నత పదవి దక్కే అవకాశం రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నాగమణి ఎన్నికైతే పరవాడ మండలానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ముఖ్యంగా ఆమె స్వగ్రామమైన రావాడ పంచాయతీకి కూడా అరుదైన గౌరవం దక్కనుంది. గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి జిల్లా స్థాయి నాయకత్వం వరకు మోటూరు సన్యాసినాయుడు కుటుంబ రాజకీయ ప్రస్థానంలో ఇది కీలక మలుపుగా నిలవనుంది. ఇప్పటికే జడ్పీ పీఠంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నాగమణికి అవకాశం దక్కితే పరవాడ మండలం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయనుంది. అయితే నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. పరవాడకు జడ్పీ పీఠం దక్కుతుందా? రావాడ గ్రామానికి జిల్లా స్థాయిలో అరుదైన గుర్తింపు లభిస్తుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్