ప్రజాశక్తి-అచ్చుతాపురం: ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు పెంచి, వారిని పర్మినెంట్ చేయడంతో పాటు సెలవులు మంజూరు చేయాలని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా పోస్టులను పెంచాలని కోరుతూ ఎలమంచిలి నియోజకవర్గ ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అచ్చుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆశా కార్యకర్తలు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు పెంచాలని, సెలవుల సౌకర్యం కల్పించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ఆశా పోస్టులను మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా కోశాధికారి, మునగపాక పి హెచ్ సి నాయకులు పి ఎస్ కుమారి, పి జ్యోతి, అచ్చుతాపురం మండలం డి సరోజిని ,సూర్యలక్ష్మి, సిహెచ్ మంగ, రాంబిల్లి ఆర్ రమ్య ,సిహెచ్ మంగమ్మా రేగుపాలెం ఏ భూలక్ష్మి సిఐటియు నాయకులు ఆర్ రాము, జి దేవుడు నాయుడు ,కె సోమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)