ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల తేదీల్లో మార్పు

14 నవంబర్, 2026

ఎన్నికల  తేదీల్లో  మార్పు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కోటవురట్ల : గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల విడతల్లో మరోసారి మార్పు చోటుచేసుకుంది. తొలుత కోటవురట్ల మండలంలో సర్పంచ్ ఎన్నికలు మూడో విడతలో నిర్వహించనున్నట్లు తేదీలు ఖరారు చేయగా, తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా ఎన్నికల విడతలను పునఃసమీక్షించి మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోటవురట్ల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో విడతలో నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ అధికారికంగా సమాచారం అందించినట్లు ఎంపీడీఓ కార్యాలయం వెల్లడించింది. తేదీలు ఖరారైన అనంతరం మళ్లీ ఎన్నికల విడతల్లో మార్పులు జరిగిన విషయాన్ని ఆర్వో చంద్రశేఖర్ తెలియజేశారు. దీంతో కోటవురట్ల మండలంలో సర్పంచ్ ఎన్నికలు మూడో విడతకు బదులుగా రెండో విడతలో జరగనున్నాయి.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్