గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గండికోట జలాలు సరఫరాకు చర్యలు

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు : ముద్దనూరు మేజర్ పంచాయతీ లోని ఎల్ఎమ్ కాంపౌండ్, ఆర్టిపిపి రోడ్డు, ఎస్సీ కాలనీకి గండికోట జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపిడిఒ,స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ వేణి తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలోని సభా భవనంలో గురువారం రాధాకృష్ణ వేణి ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, తాగునీరు, పశు పోషణ, ఉపాధి, రోడ్లు, పారిశుధ్యం, వ్యవసాయం, విద్యుత్ వంటి అంశాలపై చర్చించారు. వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖలకు చెందిన మండల అధికారులు సభలో వివరించారు. ఎల్ ఎమ్ కాంపౌండ్, ఆర్టిపిపి రోడ్డు, ఎస్సి కాలనీకి గండికోట శుద్ధి జలాలు అందడం లేదని ప్రజలు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీ వాసులకు శుద్ధి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సభలో ప్రజాశక్తి విలేఖరి అడిగారు. నీటి సమస్య లేకుండా పైపు లైన్ ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలకు గండికోట శుద్ధి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్