ప్రజాశక్తి -మక్కువ : ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సవర అర్పిత్ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా ఆనసభద్రలో ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న అర్పిత్‌ను హుటాహుటిన డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్పిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఏకలవ్య పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)