గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమ్మెల్యే బండారు కృషితో పెదపళ్ళ ఊర చెరువు సమస్యకు పరిష్కారం

1 గంట క్రితం

aalamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో పెదపళ్ళ ఊర చెరువు నీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. గత దశాబ్ద కాలంగా ఈ చెరువుకు నీరు అందించే పంట కాలువ పూర్తిగా పూడుకుపోవడంతో ఈమధ్య వాడపాలెంలో ఎమ్మెల్యే బండారుతో జరిగిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి గ్రామ నేతలు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా పెదపల్ల గ్రామ నేతలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలోనే పెదపళ్ళ ఊర చెరువు నీటి సమస్య అంశం గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగానే ఎమ్మెల్యే తక్షణం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారన్నారు. దానితో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిస్తూ గురువారం కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉర చెరువుకు నీరు అందించే పంట కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ కాలువ పనులతో ఊర చెరువును నీటితో నింపడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు, మత్స్యకారుల, గ్రామ పంచాయతీ ఆదాయానికి పరిష్కారం లభించనుంది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగానే పరిష్కారానికి కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్